ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి
మేడ్చల్‌కు, పరేడ్‌గ్రౌండ్ స్టేషన్
నుంచి శామీర్‌పేటకు రెండు
కారిడార్ల నిర్మాణం మూడు నెలల్లో
డిపిఆర్‌ల తయారీ కేంద్ర,రాష్ట్ర
ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా
రూపొందించాలి మెట్రో ఎండి
ఎన్‌విఎస్‌రెడ్డికి సిఎం ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ ఉ త్తర నగరవాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త ప్రకటించా రు. మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో రైల్ పొ డిగించాలని సిఎం నిర్ణయించారు. దీంతో హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకుమెట్రో రైల్ కల నెరవేనున్నది. ఈ మేరకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు త యారు చేయాల్సిందిగా హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డిని ఆదేశించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్- మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు (23 కిలోమీటర్లు); పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ (జూబ్లీ బస్టాండ్) నుంచి – శామీర్ పేట్ వరకు (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డిపిఆర్ తయారు చేయాల్సిందిగా సిఎం ఆదేశించినట్టు మెట్రోరైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి బుధవారంవిడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మెట్రో రైల్ ఫేజ్-2 ’బి’ కారిడార్ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించవలసిందిగా సిఎం ఆదేశించినట్టు మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఇలా ఉండగా బుధవారం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండి ఎఎన్‌విఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డిపిఆర్ తయారీ పై సిఎం రేవంత్‌రెడ్డి చర్చించి ఈ మేరకు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి తాడ్ బన్డ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఒఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ నిర్మించనున్నారు. అదే విధంగా జెబిఎస్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకింపేట్, తూముకుంట, ఒఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్ కు 22 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డికి మెట్రో ఎండీ ఎన్‌విఎస్ రెడ్డి వివరించారు. గతంలో మల్కాజ్ గిరి ఎంపిగా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్‌ల రూట్ మ్యాప్ లపై తనకు పూర్తి అవగాహన ఉందని సిఎం గుర్తు చేశారు. ఈ కొత్త మెట్రోరైల్ కారిడార్ రూట్ మ్యాప్ పై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను తీసుకోవలసిందిగా సిఎం ఆదేవించినట్టు ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు.
డిపిఆర్ మూడు నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సిఎం సూచించినట్టు ఎండి చెప్పారు. మెట్రో ఫేజ్-2 ’ఏ’ భాగం లాగే ’బి’ భాగాన్ని కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ అనుమతికి కోసం పంపించాలని సిఎం ఆదేశించడంతో డిపిఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ ల తయారీ చేపడుతున్నట్టు మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి చెప్పారు.