Wednesday, January 22, 2025

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Extension of application deadline for Gurukul admissions

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : సాంఘిక, గిరిజన, బిసి సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీలలో ఐదో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 7వ తేదీ వరకు పొడిగిస్తూ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీలలో 5వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తుల అందజేసేందుకు చివరి తేదీ ఈ నెల 28వ తేదీ కాగా.. ఆ గడువును ఏప్రిల్ 7వ తేదీ వరకు పొడిగించారు. గురుకుల ప్రవేశ పరీక్ష మే 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాలలో నిర్వహించనున్నారు. ప్రవేశాల సంబంధిత సందేహాల కోసం అభ్యర్థులు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 45678లో వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ప్రాస్పెక్టస్, అర్హత ప్రమాణాలు, ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ వెబ్‌సైట్ www.tgcet.cgg.gov.in, www.tswreis.ac.in,; www.tresidential.cgg.gov.in, www.tgtwgurukulam.telangana.gov.in ; www.mjptbcwreis.telangana.gov.inలను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News