Wednesday, January 22, 2025

చక్కెర ఎగుమతులపై నిషేధం పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం మరోసారి ఆంక్షలను పొడిగించింది. చక్కెర ఎగుమతులపై అక్టోబర్ 31 తర్వాత కూడా ఆంక్షలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పండుగ సీజన్‌లో దేశీయ మార్కెట్లో ఆహార వస్తువుల ధరల లభ్యతను పెంచే లక్షంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో చక్కెర ఎగుమతిపై నిషేధం 31 అక్టోబర్ తర్వాత కూడా కొనసాగుతుంది. దీనిలో ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెర, తెలుపు చక్కెర, సేంద్రీయ చక్కెర ఉన్నాయి. పండుగ సీజన్‌లో చక్కెర ధరలు పెరగడంతో చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డిజిఎఫ్‌టి నోటిఫికేషన్ ప్రకారం, యూరోపియన్ యూనియన్, అమెరికా ఈ నిషేధం పరిధిలోకి రావు, వాటికి ఎగుమతులు కొనసాగుతాయి. గతంలో ప్రభుత్వం ఆదేశాల్లో, అక్టోబర్ 12 నాటికి పూర్తి ఉత్పత్తి, పంపిణీ, డీలర్, రిటైలర్, అమ్మకాల డేటాను అందించాలని ప్రభుత్వం చక్కెర కంపెనీలను ఆదేశించింది. గణాంకాలు ఇవ్వకుంటే చేయకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపింది. నవంబర్ 10లోగా ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్ పోర్టల్‌లో నమో దు చేసుకోవాలని చక్కెర మిల్లులను ప్రభుత్వం కోరింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇటీవలి నివేదిక ప్రకారం, సెప్టెంబర్‌లో ప్రపంచ చక్కెర ధరలు దాదాపు 13 ఏళ్లలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. భారత్, థాయ్‌లాండ్‌లో ఎల్‌నినో కారణంగా చెరకు పంటలు కూడా దెబ్బతినగా, ఇది చక్కెర ధరల ధరలకు కారణమైందని సంస్థ చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News