మన తెలంగాణ / హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు గడవు పొడిగించారు. సాంఘీక, గిరిజన, బిసి సంక్షేమ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే 5టిజి సెట్ 2022 గడవు జులై 29తో ముగిసింది. అయితే ఈ గడవును ఆగష్టు 1 వరకు పొడిగించినట్లు 5 టిజి సెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్ రాస్ ప్రకటించారు. 5వ తరగతిలో ప్రవేశాలకు రెండో జాబితాలో ఎంపికైన విద్యార్థులు ఆగష్టు 1వ తేదీలోగా తమకు కేటాయించిన గురుకుల పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఒక వేల గడవులోగా రిపోర్ట్ చేయని విద్యార్థులు సీటు కోల్పోయినట్లేనని స్పష్టం చేశారు. విద్యార్థులు సరియైన ధృవీకరణ పత్రాలు విద్యార్హతల టిసి, ఆదాయ దృవీకరణ పత్రాలు, సెలక్షన్ లెటర్, బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించడం ద్వారా ప్రవేశాలు పూర్తి చేసుకోవాలన్నారు. విద్యార్థులు వివారలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 45678 నెంబర్‌కు సంప్రదించవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇతర అంశాలకు సంబంధించి వెబ్‌సైట్ www.tgcet.cgg.gov.in, www.tswreis.ac.in ను సందర్శించి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.