Monday, January 20, 2025

గురుకుల కళాశాల ప్రవేశాలకు గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

Extension of deadline for admissions to Gurukul College

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలో 2022- 23 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం మే 22న నిర్వహించే టిఎస్‌ఆర్‌జెసి -సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 30వ తేదీ గడువును పొడిగిస్తూ తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్ధ ప్రకటించింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంగ్లీష్ మీడియంలో ఎంపిసి, బిపిసి, ఎంఈసి)లో 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కోసం మే 22వ తేదీన నిర్వహించే టిఎస్‌ఆర్‌జెసి -సెట్ ప్రవేశ పరీక్షకు మే 2022 పరీక్షలకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు విధించారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించారు. పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News