Thursday, January 23, 2025

ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజును ఆలస్య రుసుంతో చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 17 వరకు, రూ.వెయ్యి ఆలస్య రుసుంతో 22 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుంతో వచ్చే నెల 28 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.

అలాగే ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు హాజరుకానున్న ప్రైవేటు ఆర్ట్ విద్యార్థులకు హాజరు మినహాయింపు కోరుకునే అభ్యర్థులు ఈ నెల 23 వరకు రూ. 200 ఆలస్య రుసుం ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News