Thursday, January 23, 2025

రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు రోజుల్లో ప్రస్తుత గడువు ముగియనుంది. అయితే తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తికాలేదు. దీంతో రేషన్ కార్డులను ఆధార్ సంఖ్యతో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం పెంచింది.రాష్ట్రంలో ఈ ప్రక్రియ 75.76 శాతం పూర్తయింది.

ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌ను ఆదేశించారు. కాగా, రాష్ట్రం వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కేవైసీ గడువును మరోసారి పొడించేంది లేదని అధికారులు గతంలో ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వమే చివరి తేదీని పొడిగించడంతో కొత్త రేషన్ కార్డులపై కాంగ్రెస్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయం తెలియాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News