Monday, December 23, 2024

ఇడి చీఫ్ పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ మిశ్రా పదవీకాలం పొడిగింపు చట్ట విరుద్ధమని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆయన పదవీకాలం పొడిగింపు కుదరదని వెల్లడించింది. జులై 31 తర్వాత ఆయన ఆ పదవిలో ఉండరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆలోపు ఈడీకి కొత్త అధిపతిని నియమించుకోవాలని కేంద్రానికి సూచించింది.

సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపు ఉండకూడదంటూ 2021నవంబరులో ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడమేనని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రంనాథ్,జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే తక్షణమే ఈడీ చీఫ్‌ను మార్చాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిగణన లోకి తీసుకున్న సుప్రీం కోర్టు జులై 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగవచ్చని పేర్కొంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధిపతిగా నవంబర్ 2018లో సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. రెండేళ్ల తరువాత (60 ఏళ్ల వయసు వచ్చిన ) ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. మే నెలలో ఆయనకు 60 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ నవంబర్ 2020లో ఆయన పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అనంతరం 2022 లోనూ మూడోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్‌తోపాటు పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు సంజయ్ మిశ్రా పొడిగింపు కుదరదని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News