Monday, December 23, 2024

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

Extension of Inter Advanced Supplementary Fee date

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గత నెల 30న ప్రారంభంగా కాగా, బుధవారంతో గడువు ముగిసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో రెండు రోజులపాటు ఇంటర్ అడ్వాక్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News