Saturday, April 5, 2025

ఆప్ నేతల జుడిషియల్ కస్టడీ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు గురువారం పొడిగించింది. ఇదివరకు ఇచ్చిన జుడిషియల్ రిమాండ్ గడువు ముగిసిపోవడంతో వారిద్దరినీ ప్రత్యేక జడ్జి ఎంకె నాగ్‌పాల్ ఎదుట హాజరుపరచగా కస్టడీని పొడిగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు. కేసు చాలా కీలక దశకు చేరుకుందని, నిందితులను ఈ దశలో బెయిల్‌పై విడుదల చేస్తే వారు కేసు దర్యాప్తును ప్రభావితం చేయగలరని కోర్టుకు ఇడి తెలిపింది. నిందితుల జుడిషనల్ కస్టడీని పొడిగించాలని డి కోరింది. గత ఏడాది ఫిబ్రవరిలో సిసోడియాను అరెస్టు చేగా సంజయ్ సింగ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో ఇడి అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News