ఈనెల 10 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరవాసులకు మెట్రో రైలు మంచి శుభవార్త అందించింది. ఈ నెల 10 వ తేదీ నుంచి మెట్రో సేవలను పొడిగిస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎల్‌అండ్ టి మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ ఎండి, సిఇఓ కెవిబి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మెట్రో రైలు సేవలు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రాత్రి 10.15 గంటలకు వరకు కొనసాగుతున్నాయని మెట్రో రైలు తాజాగా సమయాన్ని సవరిస్తూ 11.00 గంటల వరకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఇప్పటీ వరకు ఆఖరి ప్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు బయలుదేరే మెట్రో చివరి సర్వీస్ ఈ నెల 10వ తేదీ నుంచి రాత్రి 11 గంటలకు బయలు దేరుతుందని ప్రకటించారు. 45 నిమిషాల సమయం పెంచడంతో నగరవాసులు మరిన్ని అదనపు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని వీటిని సద్వినియోగం చేసుకోకుని మెట్రో రైలుకు తోడ్పాటును అందించాలని ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.