న్యూఢిల్లీ : మహిళల వివాహ వయస్సును ప్రస్తుతపు 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కోరుతున్న బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీకి నివేదిక సమర్పణకు గడువును మరొక సారి పొడిగించడమైంది. బుధవారం (31న) మొదలు కానున్న పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌పార్లమెంటరీ ఎన్నికలు ప్రకటించే లోపు ప్రస్తుత లోక్‌సభకు చివరి సెషన్ అవుతుంది. మరి నాలుగు నెలల పొడిగింపు లభించిన దృష్టా కమిటీ మే నెలాఖరు నాటికి తన నివేదికను ఖరారు చేయగలదు. 17వ లోక్‌సభ గడువు జూన్ 16న లోక్ సభలో ప్రవేశపెట్టి అక్కడ పెండింగ్‌లో ఉన్న బాల్య వివాహ నిషేధం (సవరణ) బిల్లు 2021కి జూన్‌లో సభ కాలపరిమితి ముగిసినప్పుడు మురిగిపోవచ్చు.
లోక్‌సభలో ప్రవేశపెట్టి, ఆమోదముద్ర పొందిన బిల్లులు, రాజ్యసభ ఆమోదించి దిగువ సభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు లోక్‌సభ రద్దుతో మురిగిపోతాయి. ‘బాల్య వివాహ నిషేధం (సవరణ) బిల్లు 2021 పరిశీలన నిమిత్తం విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడల పార్లమెంటరీ స్థాయీ సంఘానికి రాజ్యసభ చైర్మన్ మరి నాలుగు నెలల సమయం మంజూరు చేశారు’ అని ఈ నెల 24న విడుదలైన ఒక బులెటిన్ వెల్లడించింది. కమిటీకి తన నివేదిక ఖరారుకు గతంలో కూడా గడువులు పొడిగించడమైంది.