సంగారెడ్డి: ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నత చదువులు చదువుతున్న బిసి, మరియు ఇబిసి విద్యార్థినీ విద్యార్థుల నుంచి ఉపకాల వేతనాల కోసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడగించినట్లు వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్ అన్నారు. 2022/23 విద్యా సంవత్సరానికి గాను రినివల్, ప్రెష్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవడానికి మరి యొక్క సారి అవకాశాన్నీ కల్పించామన్నారు. ఇంటర్‌మీడియెట్ ఆపైస్థాయిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తులను ఆన్‌లైన్ చేసుకోవడానికి గాను ప్రభుత్వం 15 వరకు గడువు పొడగించిందన్నారు.
కావున సంబంధిత ప్రిన్సిపాల్స్ ఆయా విద్యార్థిని విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియజేసి వారిని ప్రోత్సహించాలని ఆయన కోరారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో www.telangana epass.cgg.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు.