Sunday, December 22, 2024

ఎక్సైజ్ ఆధ్వర్యంలో పెంబి మండలంలో విస్తృత తనిఖీలు

- Advertisement -
- Advertisement -

పెంబి : గురువారం ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమీషనర్ ఆదేశాల మేరకు పెంబి మండలంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ ఈ తనిఖీల్లో ఇటీక్యాల్ తాండకు చెందిన గుగులావత్ లలిత వద్ద నిషేదిత గుడుంబా సుమారు ఐదు లీటర్లు లభించగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అనంతరం అందిన సమాచారం మేరకు పెంబి తాండలో తనిఖీ చేయగా రాథోడ్ మోతిసింగ్ గుడుంబా తయారు చేస్తుండగా కనుగొని గుడుంబా తయారీ బట్టీ ధ్వంసం చేసి సుమారు ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులు రాథోడ్ మోతీసింగ్, అజ్మీరా రాజేశ్వరీలను స్థానిక తహసీల్తార్ ఎదుల బైండోవరపర్చారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్సై రాయబారపు రవికుమార్, సిబ్బంది నరేంధర్, రషీద్,గౌతం, వెంకటేష్, కల్పన, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News