Sunday, December 22, 2024

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం

- Advertisement -
- Advertisement -

కాటారం : తెలంగాణ రాష్ట్రంలో హనుమంతుని గుడిలేని ఊరులేదు.. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు అందని ఇళ్లులేదని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి అన్నారు. సిఎన్నార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో తలపెట్టిన గడప గడపకు సిఎన్నార్ పాదయాత్ర 6వ రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని డుప్పులపల్లి, నేతకాని వాడలో ఇంటింటికి పర్యటించి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సిఎన్నార్ ప్రజలతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలతో లబ్ధిచేకూరిందని అన్నారు. ప్రతి వ్యక్తికి ఏదోఒక రకమైన లభ్ది అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మూడవ సారి బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చే విధంగ ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని సూచించారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచిందని కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ్ద సంక్షేమం సమతుల్యంగా జరుగుతుందని వివరించారు ఆ కార్యక్రమంలో భాగంగా పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. సిఎన్నార్ వెంట బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News