Thursday, January 23, 2025

ఐదురోజుల పర్యటనకు రష్యాకు విచ్చేసిన జైశంకర్

- Advertisement -
- Advertisement -

మాస్కో : కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తన ఐదురోజుల పర్యటన కోసం రష్యాకు సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల మధ్య వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై రష్యా విదేశాంగ మంత్రితో చర్చిస్తారు.సెయింట్ పీటర్‌బర్గ్‌లో కూడా ఆయన పర్యటిస్తారు. “ కాలపరీక్షలో భారత రష్యా భాగస్వామ్యం స్థిరంగా, స్థితిస్థాపకంగా ఉందని, ప్రత్యేకమైన , విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో ఇది మరింత రూపొందుతుంది ” అని జైశంకర్ ఆదివారం ఢిల్లీలో పేర్కొన్నారు. ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి రష్యా డిప్యూటీ ప్రధాని , పరిశ్రమలు, వాణిజ్యం మంత్రి, డెనిస్ మంటురోవ్‌తో చర్చిస్తారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గేలావ్‌రోవ్‌తో ద్వైపాక్షిక, బహుపాక్షిక, అంతర్జాతీయ సమస్యలపై చర్చిస్తారు. ఉభయ దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై మంత్రి దృష్టి కేంద్రీకరిస్తారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News