న్యూఢిల్లీ: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఎ) కార్యాలయంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడిన ఎన్‌ఐఎ ఎస్‌పి, ఇన్‌స్పెక్టర్‌పై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించి ఇంఫాల్‌లోని ముగ్గురు స్థానిక పౌరుల నుంచి రూ. 60 లక్షలు వసూలు చేసినట్లు ఈ ఇద్దరు ఎన్‌ఐఎ అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇంఫాల్‌లో ఎన్‌ఐఎ ఎస్‌పిగా పనిచేసిన విశాల్ గర్గ్, ఇన్‌స్పెక్టర్ రబీబ్ ఖాన్ అకడి స్థానికులను కేసుల పేరుతో బెదిరించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని సిబిఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
Also Read: శరద్ పవార్ మార్గదర్శనంలో ఎన్‌సిపి కొత్త సారథి పనిచేస్తారు: అజిత్ పవార్
ఈ ఇద్దరు అధికారులపై ఐపిసిలోని సెక్షన్ 120బి, 388 సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సిబిఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని ఎన్‌ఐఎ ప్రధాన కర్యాలయంలో పరిపాలనా విభాగం డిప్యుటీ సూపరింటెండెంట్ సుదాంశు శేఖర్ శుక్లా నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిబిఐ ఆ ఇద్దరు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. విశాల్ గర్గ్, రజీబ్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపినట్లు శుక్లా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.