Wednesday, December 25, 2024

ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా…

- Advertisement -
- Advertisement -

నితిన్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎక్స్ ట్రా -ఆర్డినరీమ్యాన్ ’. రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హేరిష్ జయరాజ్ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే… ఇందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారని, సినిమా షూటింగ్‌కు వచ్చిన వారిలో తనొక ఎక్స్‌ట్రా మెంటర్‌గా ఉంటారని అర్థమవుతోంది. ఇక యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్‌గా ఉన్నాయి. నితిన్ పాత్ర ఆసక్తికరంగా ఉంది. శ్రీలీలతో హీరో లవ్ ట్రాక్, తండ్రయిన రావు రమేష్‌తో హీరో నితిన్‌కు ఉండే సంఘర్షణ ఇవన్నీ టీజర్‌లో ఉన్నాయి. వక్కంతం వంశీ తనదైన శైలిలో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని స్పష్టమవుతుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రుచిత ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News