Sunday, December 22, 2024

ఓటీటీలో నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్

- Advertisement -
- Advertisement -

నితిన్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. యువ హీరో నితిన్, డైనమిక్ హీరోయిన్ శ్రీలీల నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల మొదటివారంలో విడుదలైన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. థియేటర్లలో అంతగా ఆడని ఈ సినిమా, ఓటీటీలోనైనా విజయవంతం అవుతుందేమోనని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. యాంగ్రీ హీరో రాజశేఖర్ మొదటిసారిగా ఈ సినిమాలో కేరక్టర్ రోల్ పోషించారు. నితిన్ సినిమాకు హారిస్ జైరాజ్ సంగీతం అందించడం కూడా ఇదే మొదటిసారి.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా సినిమాను స్ట్రీమ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News