Monday, December 23, 2024

సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం

- Advertisement -
- Advertisement -
  • నూతన పంచాయతీ రాజ్ చట్టంతో పకడ్బందీగా పాలన
  • ప్రత్యేక తెలంగాణలో అన్ని గ్రామాల్లోఅభివృద్ధి
  • నెలనెలాల మెయింటెన్స్ నిధులతో గ్రామాలాభివృద్ధి
  • గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంతోనే రా్రష్ట్రం, దేశం అభివృద్ధి
  • నవాబుల పాలనలోనే తెలంగాణ ప్రాంతం వెనుకబాటు
  • రూ.20లక్షల ఎస్‌డిఎఫ్ నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు

మన తెలంగాణ/కోహీర్: సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం తీవ్ర అన్యాయానికి గురైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. ఈసందర్భంగా మండల పరిధిలోని బడంపేట గ్రామంలో రూ.20లక్షల ఎస్‌డిఎఫ్ నిధులతో సిసి రోడ్డు పనులను గురువారం ఎమ్మెల్యే మాణిక్‌రావు గ్రా మ సర్పంచ్ బాయికాడి సుశీలమ్మతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల హయాంలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. కాని సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచిపల్లెల్లో మౌలిక వసతు ల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తూ గ్రామాలను అ భివృద్ధి బాటలో నడిపిస్తుందన్నారు.

గ్రామాలాభివృద్ధికి జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చే సి పల్లెల రూపురేఖలను మారుస్తున్నట్లు తెలిపారు. కాగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగాగ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ కార్మికులు, మల్లిపర్పస్ కార్మికులకు ఎమ్మెల్యే మాణిక్‌రావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దశాబ్ది ఉత్సవాల ఇంచార్జి జయదేవ్ ఆర్య, ఎంపిడిఓ సుజాతనాయక్, పంచాయతీ రాజ్ మండల అసిస్టెంట్ ఇంజనీర్ కోటేశ్వర్‌రావు, సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ రఘు సర్పంచుల ఫో రం మండల అధ్యక్షుడు జంగిలి రవికిరణ్, బడంపేట గ్రామ సర్పంచ్ బాయికాడి సుశీలమ్మ, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింలు యాదవ్, సీనియర్‌నాయకులు కొత్తకాపు గోవర్దన్ రెడ్డి, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ రామక్రిష్ణారెడ్డి, సీనియర్ నాయకు లు శివమూర్తి, బిఆర్‌ఎస్ గ్రామ శాఖ అద్యక్షుడు రఘుపతి రెడ్డి, నాయకులు బాయికాడి సుధాకర్ శ్రీనివాస్, వెంకటేశం, కోటిలింగంలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News