Tuesday, January 21, 2025

నిప్పుల వాన

- Advertisement -
- Advertisement -

అత్యధికంగా ఆదిలాబాద్‌లో
43.3 డిగ్రీలు,
42.4, రామగుండం 41.4,
హన్మకొండ 41,
మహబూబ్‌నగర్ 40.9,
హైదరాబాద్‌లో 40 డిగ్రీలు
పంటల నాణ్యతపై
వ్యతిరేక ప్రభావం: నిపుణులు

మన తెలంగాణ/హైదరాబాద్ : స్వల్పకాలిక ఉపశమనం తరువాత తెలంగాణ అంత టా శనివారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు సెల్సియస్ దాటి నమోదు అ యిందని హైదరాబాద్ లోని భారత వాతావరణ పరిశోధనా సంస్థ (ఐఎండి) తెలిపింది. శనివారం ఆదివారం తీవ్ర వేడిమి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యగా ఆరంజ్ అలర్ట్ సంకేతాలు వెలువరించారు. వచ్చే కొద్ది రోజులలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీలకు చేరుతాయని, అప్రమత్తంగా ఉండాలని తెలిపేలా ఈ ఆరంజ్ హెచ్చరిక వెలువడింది. ఈ వారం ఆరంభంలో కురిసిన వర్షాలు వాతావరణాన్ని చల్లబర్చాయి. అయితే మామిడి, నిమ్మ తోటలకు నష్టం కల్గింది. మబ్బుతో కూడిన వాతావరణంతో చల్లని గాలులు వీచి నా తరువాతి రోజులలో తిరిగి వేడి రగులుకుంది. అ యితే మరో నాలుగు అక్కడక్కడ చెదరుమదురు వర్షాలు పడుతాయని, అయితే వీటితో ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గే అవకాశాలు లేవని వాతావరణ పరిశోధన సంస్థ తెలిపింది. హైదరాబాద్‌లో వచ్చే 48 గంటల్లోగర్షిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుందని శనివారం ఐఎండి తెలిపింది.

తెలంగాణలో తరచూ మారుతూ వస్తున్న వాతావరణ ప్రభావం ఎక్కువగా పంటల నాణ్యతపై పడుతుందని వ్యవసాయ నిపుణులు తెలిపారు. ప్రత్యేకించి మామిడి, అరటి, నిమ్మ పంటలపై ప్రభావం పడుతుంది. పైగా ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, గాలిలో తేమ లేకపోవడం వంటి పరిణామాలతో ఆరోగ్యపరంగా పలు చిక్కులు ఏర్పడుతాయని వైద్యులు తెలిపారు. ఇందుకు నివారణగా ఎక్కువగా మంచినీరు, సరైన నిమ్మరసం తీసుకోవాలి. నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోరాదని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News