- Advertisement -
ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో భద్రత కరువైంది. గుర్తుతెలియని దుండగులు హాస్టల్లో చొరబడటంపై తమకు రక్షణ లేదంటూ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. హాస్టల్ ప్రాంతంలో సిసిటివిలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు అగంతకుడిని తీసుకెళ్లొద్దంటూ పోలీసుల ముందు నిరసనకు దిగారు. ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో రాత్రి ముగ్గురు ఆగంతకులు చొరబడి విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. అప్రమత్తమైన అమ్మాయిలు ఒకరిని పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. హాస్టల్లో రక్షణ లేదని, సిసిటివిలు ఏర్పాటు చేయాలని నిరసనకు దిగారు. సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు వెనక్కి తగ్గారు.
- Advertisement -