Monday, December 23, 2024

బడి పిల్లలకు కంటి, ఒంటి పరీక్షలు నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వానికి బాలల హక్కుల సంక్షేమ సంఘం వినతి

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు కంటి పరీక్షలు, ఒంటి పరీక్షలు నిర్వహించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యార్థులకు పై ఆరోగ్య సమస్యలతో పాటు డయాబెటిస్ పరీక్షలు కూడా నిర్వహించాని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి డా. గుండు కిష్టయ్య, ఇ.రఘునందన్ ఆన్‌లైన్ ద్వారా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం వారొక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలల్లో చదువుచున్న పిల్లలు ప్రత్యేకంగా కంటి చూపు, రక్తహీనత, థైరాయిడ్, డెంటల్, విటమిన్-డి లోపం, హృదయ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్లో ఉన్న ఆరోగ్య సంబంధ సమస్యలు ముందుగానే గుర్తిస్తే వాటి నివారణ సులభతరం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయమై దృష్టిసారించాలని కోరారు. ఆరోగ్య తెలంగాణ సాకారం కావాలంటే బడి పిల్లల ఆరోగ్యం కూడా ముఖ్యమైందని వారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News