Friday, December 27, 2024

మధుమేహంతో కంటిచూపు సమస్యలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ: వయసు సంబంధిత కంటిచూపు క్షీణత, డయాబెటిక్ రెటినోపతి వంటి ప్రగతిశీల వ్యాధుల కేసులు పెరుగుతుండటం ఆందోళ కలిగిస్తుందని విట్రియో రెటీనా సొసైటీ వెల్లడించింది. ఎఎండి మక్యులాలో కణజాలం నష్టంతో ఇది సంభవిస్తుందని, సెంట్రల్ విజన్‌ను ప్రభావితం చేస్తుంది. దేశంలో మధుమేమ వ్యాధిగ్రస్తులో 17.6 శాతంమందికిపైగా డయాబెటిస్ రెటినోపతితో బాధపడుతున్నట్లు ఆసంస్ద నిర్వహకులు తెలిపారు.

ఈసందర్భంగా వైస్ ప్రెసిడెంట్ డా. ఎన్.ఎస్. మురళీధర్ మాట్లాడుతూ సాధారణంగా రెటీనా వ్యాధుల గురించి తక్కువ అవగాహణ ఉంది. మనకు తెలిసినట్లుగా ప్రపంచానికి మధుమేహ రాజధానిగా మారనుందన్నారు. డయాబెటిక్ రెటినోపతి అంధత్వానికి ప్రధాన కారణం, అవగాహన తక్కువ ఉండటంతో చాలామంది మధుమేహ వ్యాధిగ్రస్తులు దృష్టి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కంటిచూపు ఆరోగ్యంగా ఉండటానికి ధూమపానం, స్క్రీన్ సమాయాన్ని తగ్గించడం, ఆరోగ్యమైన తినడం, రెగ్యులర్ కంటి పరీక్షలు, 202020 నియమ నిబంధనలు పాటించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News