Wednesday, January 22, 2025

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి : డిజిపి అంజనీకుమార్

- Advertisement -
- Advertisement -

పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని డిజిపి అంజనీ కుమార్ సూచించారు. బుధవారం డిజిపి కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన కంటివెలుగు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

వారం రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రతి రోజు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు ఎంతో ప్రధానమైనదని, కళ్లను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని సూచించారు. డిజిపి కార్యాలయ అధికారులు, ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు డిజిపి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News