Saturday, December 21, 2024

‘ఎఫ్ 3’ సూపర్ హిట్‌గా అనిపించింది

- Advertisement -
- Advertisement -

F3 Release on May 27th

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిసున్నారు. ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి పని చేసిన స్టార్ ఎడిటర్ తమ్మిరాజు మీడియాతో మాట్లాడుతూ “ఎఫ్ 2 చిత్రంలో పెళ్లి తర్వాత వచ్చే కష్టాలను వినోదాత్మకంగా చూపించాం.

‘ఎఫ్ 3’ డబ్బు చుట్టూ తిరిగే కథ. మానవసంబంధాలు డబ్బుతో ముడిపడి వున్నాయి. ఈ పాయింట్‌ను ‘ఎఫ్ 3’లో చాలా ఫన్‌ఫుల్‌గా చూపించడం జరిగింది. కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అనిల్ రావిపూడి సినిమాల్లో అన్నీ కామెడీ పంచులు బావుంటాయి. దానిలో ఏది ట్రిమ్ చేయలన్నా కష్టంగా వుంటుంది. అయితే ఓవరాల్ ఫ్లో చూసుకొని కథకు ఏది అవసరమో అదే ఉంచుతాం.

దిల్ రాజు అద్భుతమైన నిర్మాత. సినిమా అంటే ఆయనకి ప్రేమ. సినిమాని చాలా జాగ్రత్తగా చూస్తారు. రష్ చూశాక ‘ఎఫ్ 3’ సూపర్ హిట్‌గా అనిపించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ .. మిగతా నటీనటులంతా చాలా వండర్‌ఫుల్‌గా చేశారు. ఇక కళ్యాణ్ రామ్‌తో ‘బింబిసార’, మైత్రి మూవీ మేకర్స్ సినిమా, నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాలు చేస్తున్నా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News