Sunday, September 8, 2024

అందరికీ నవ్వు తెప్పించేలా…

- Advertisement -
- Advertisement -

F3 movie release updates

 

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్ 3’ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. థియేటర్స్‌లో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడానికి ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు…’ ను విడుదల చేశారు. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం దేవీశ్రీ ప్రసాద్ చక్కటి బాణీని సమకూర్చారు. రామ్ మిర్యాల గాత్రం, భాస్కర భట్ల సాహిత్యం పాటను మరింత అందంగా మలిచాయి. విజువల్‌గా కూడా ఈ పాటను ఎంతో స్టైలిష్‌గా తెరకెక్కించారు. ఈ పాటలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లు భిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పాటలో తమన్నా కూడా కనిపిస్తున్నారు. పాట చివరలో సినిమాలోని నటీనటులంతా కూడా డబ్బు రావాలని చేసే ప్రార్థనలు అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News