Saturday, November 16, 2024

ఎఫ్ 2 విషయంలో అదే సెంటిమెంట్

- Advertisement -
- Advertisement -

సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. కోట్లతో నడిచే వ్యాపారం కాబట్టి ఎవరి భయాలు వాళ్లకు ఉంటాయి. దాంతో రకరకాల సెంటిమెంట్స్ వచ్చి చేరతాయి. కొందరు టైటిల్స్ విషయంలో సెంటిమెంట్ కు వెళ్తే మరికొందరు రిలీజ్ డేట్ విషయంలో సెంటిమెంట్ చూపిస్తారు. ఇప్పుడు దర్శకుడు అనీల్ రావిపూడి కూడా తన తాజా చిత్రం ‘ఎఫ్ 3’ విషయంలో అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడని తెలిసింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అనుకున్న సమయంలో ఈ నెల 13న అనీల్ రావిపూడి కోవిడ్ బారిన పడ్డాడు. దాంతో ఐసోలేషన్‌కు వెళ్ళారు. ఇప్పుడు తనకు నెగటివ్ వచ్చిందని అధికారికంగా ప్రకటించారు.

అలాగని ఇప్పటికిప్పుడు షూటింగ్ ప్రారంభించే పరిస్థితి లేదు. కరోనా కాస్త అదుపులోకి వచ్చాక ప్రారంభించినా రిలీజ్ డేట్స్ దొరికేటట్లు కనపడటం లేదు. దాంతో ఈ సినిమాని తన సెంటిమెంట్ అయిన సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందనే అనిల్ రావిపూడి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2019 సంక్రాంతికి వచ్చిన తన ఎఫ్ 2 చిత్రం కలెక్షన్స్ పరంగా ఓ ఊపు ఊపేసింది. భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మహేష్‌తో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దాంతో ‘ఎఫ్ 3’ చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే నిర్ణయాన్ని నిర్మాత దగ్గర వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఆగస్టు 27న ఈ చిత్రం విడుదలను ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగస్టులో వరసగా సినిమా రిలీజ్‌లు ఉండటం తో థియేటర్స్ అడ్జస్ట్ చేయటం చాలా కష్టం. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘ఎఫ్3’ సినిమా కథ డబ్బు సంపాదన చుట్టూ తిరుగుతుందట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News