Monday, December 23, 2024

ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకోండి

- Advertisement -
- Advertisement -

F3 movie review in telugu

“ఎఫ్ 3 సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు. ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్‌బస్టర్ స్పందన రావడం ఆనందంగా వుంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్… ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు యూనివర్సల్‌గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ‘ఎఫ్ 3’ని ఎంజాయ్ చేయడం ఆనందంగా వుంది” అని పేర్కొంది ‘ఎఫ్ 3’ చిత్ర యూనిట్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’.

ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్‌తో ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మీడియా మీట్‌లో మాట్లాడారు. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “దిల్ రాజు, అనిల్ రావిపూడి మేము అంతా కలిసి ఫ్యామిలీస్‌ని థియేటర్‌కి రప్పించాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ‘ఎఫ్ 3’తో నెరవేరినందుకు ఆనందంగా వుంది. కుటుంబం అంతా కలిసొచ్చి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు”అని అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ “ఎఫ్ 3కి యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ రావడం ఆనందంగా వుంది.

సినిమాను చూసిన ప్రేక్షకులు సూపర్, ఎక్స్‌ట్రార్డినరీ, అదిరిపోయిందిగా… అంటున్నారు. ఎక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తోంది”అని తెలిపారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “వెంకటేష్‌తో సీతమ్మవాటిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ‘ఎఫ్ 3’తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్‌తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ‘ఎఫ్ 3’ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా వుంది”ఆని చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ఎఫ్ 3… రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. దిల్ రాజు, శిరీష్‌తో ఇది నాకు ఐదో సినిమా. వెంకటేష్‌కి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్ ఇమేజ్ వుండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. సినిమాలోని ఒకొక్క ఎపిసోడ్‌ని ప్రేక్షకులు సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళండి… హాయిగా నవ్వుకోండి”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News