Sunday, December 22, 2024

‘వూ.. ఆ.. ఆహా’ ప్రోమో.. క్షణాల్లో మిలియన్ వ్యూస్

- Advertisement -
- Advertisement -

F3 Movie second single Promo

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్  మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌ లలో భాగంగా ఏప్రిల్ 22న చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాటని విడుదల చేయనుంది.

తాజాగా ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాట ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. కలర్ఫుల్ అండ్ గ్లామరస్ గా డిజైన్ చేసిన ఈ ప్రోమో క్షణాల్లో వైరల్ గా మారింది. విడుదల చేసిన కొద్దిసేపటికే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ..ఈ ప్రోమోలో జోష్ ఫుల్ మాసీ డ్యాన్సులతో సందడి చేస్తూ కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట కోసం మరో చార్ట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతుంది. ప్రోమో చివర్లో సునీల్ తన ట్రేడ్ మార్క్ స్టెప్ తో కనిపించడం పాటపై ఇంకా ఆసక్తిని పెంచింది. ఏప్రిల్ 22న పూర్తి పాటని చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News