Thursday, January 23, 2025

‘ఎఫ్ 3’ వినోదంతో పాటు సందేశాన్నిచ్చింది

- Advertisement -
- Advertisement -

'F3' Movie Success Event in Hyderabad

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ అందుకున్న చిత్రం ‘ఎఫ్ 3’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పకులుగా శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ వేడుకలో ఆయన చేతుల మీదుగా యూనిట్‌కు మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ “దిల్ రాజు, శిరీష్ కథలు ఎంపిక చేయడంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. డ్రామా, ఎంటర్‌టైనర్, పెద్ద సినిమా, చిన్న సినిమా… ఇలా అన్ని రకాల జోనర్ సినిమాలు తీస్తారనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. దర్శకుడు అనిల్ సినిమాకి రావాలంటే ఇంట్లో చిరాకులన్నీ మర్చిపోయి ఖాళీ బుర్రతో రావాలి. అప్పుడు జేబు నిండా నవ్వులు వేసుకొని వెళ్ళొచ్చు. ఖాళీ జేబు ఉండొచ్చు ఏమో కానీ ఖాళీ బుర్ర వుండదనే సరికొత్త ఆలోచనతో చేసిన ‘ఎఫ్ 3’ సినిమా వినోదంతో పాటు గొప్ప సందేశాన్ని కూడా పంచింది” అని తెలిపారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “మూడో వారం కూడా సినిమా థియేటర్‌లో ఆడుతూ ఇంకా రెవెన్యూ రావడమే ‘ఎఫ్ 3’ విజయానికి నిదర్శనం. సినిమా యూనిట్‌కు గొప్ప జ్ఞాపకంగా వుండాలని అందరికీ షీల్డ్స్ ఇచ్చాం”అని చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3… ఇలా ఆరుకి ఆరు సినిమాలు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. ముందు ముందు చేసే సినిమాలకి ఇది గ్రేట్ ఎనర్జీనిస్తుంది. ‘ఎఫ్ ’ ఫ్రాంచైజీతో మళ్ళీ వస్తాం. ఆరు నెలల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఎన్ బికె 108’తో మళ్ళీ కలుద్దాం”అని చెప్పారు. ఈ వేడుకలో వరుణ్ తేజ్ పాల్గొన్నారు.

‘F3’ Movie Success Event in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News