Tuesday, January 21, 2025

అందుకే ‘ఎఫ్ 3’ టికెట్ల రేట్లని తగ్గించాం

- Advertisement -
- Advertisement -

 

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ’ఎఫ్ 2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్‌ను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిసున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి ఈ నెల 27న ‘ఎఫ్ 3’ ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజుతో ఇంటర్వూ…

నాన్ స్టాప్ ఎంటర్‌టైనర్…

‘ఎఫ్ 2’ విడుదలకు ముందే దర్శకుడు అనిల్‌కు ‘ఎఫ్ 3’ ఐడియా వచ్చింది. ‘ఎఫ్ 2’ పెద్ద హిట్ అయితే ‘ఎఫ్ 3’ చేద్దామని చెప్పారు. మేము అనుకున్నట్లే ‘ఎఫ్ 2’ పెద్ద విజయం సాధించింది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత స్క్రిప్ట్‌ని పూర్తి చేసి నటీనటులందరినీ మళ్ళీ ఒక్కదగ్గరి చేర్చి సెట్స్‌పైకి వెళ్లాం. ‘ఎఫ్ 3’ కథ చెప్పినపుడు ఎంత నవ్వుకున్నానో సినిమా చూసిన తర్వాత దానికి మించి నవ్వుకున్నాను. ఈ సినిమా నాన్ స్టాప్ ఎంటర్‌టైనర్, పూర్తి ఫన్ రైడ్.

డబ్బు చుట్టూ తిరిగే కథ…

‘ఎఫ్ 3’ సినిమా విషయానికి వస్తే.. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి.. ఇవి పంచభూతాలు. ఇవి లేకుండా మనిషి బ్రతకలేడు. ఈ పంచభూతాలతో పాటు ఆరో భూతం డబ్బు కూడా మనిషి బ్రతకడానికి అంతే అవసరం. డబ్బు లేకుండా మనిషి బ్రతకలేడు. బంధాలు, వ్యాపారాలు అన్నీ డబ్బుతోనే ముడిపడి వున్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగే కథ ఎఫ్ 3. అనిల్ అద్భుతంగా రాశాడు, తీశాడు. అనిల్‌లో నాకు నచ్చే అంశం ఏమిటంటే కథ కంటే కథనంపై ఎక్కువ దృష్టి పెడతాడు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తున్నామా లేదా అని చూస్తాడు.

90 నిమిషాలు నవ్వుతూనే ఉంటారు…

‘ఎఫ్ 3’ ఆర్టిస్టులకు బొనంజా లాంటింది. ఇంతమంది ఆర్టిస్ట్‌లని పెట్టుకొని అద్భుతమైన ఫన్ క్రియేట్ చేశాడు అనిల్. సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాను. ప్రేక్షకుడిగా ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. సినిమా రన్ టైమ్ 2 గంటల 28 నిమిషాలు వుంటుంది. ఇందులో 90 నిమిషాలు నాన్ స్టాప్‌గా నవ్వుతూనే వుంటారు. అంత ఫన్ రైడ్‌గా వుంటుంది ఈ సినిమా. ఇక దర్శకుడు అనిల్ ‘ఎఫ్ 4’ గురించి మంచి ఐడియా చెప్పాడు. నెక్స్ ఈ సినిమా ఉంటుంది.

అందుకే టికెట్ల రేట్లని తగ్గించాం…

కరోనా సమయంలో ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం. ఇందులో మంచి ఫలితాలు కూడా సాధించాం. అయితే ఇక్కడ పరిశీలించిన అంశం ఏమిటంటే.. చాలా మంది ప్రేక్షకులు థియేటర్‌కి దూరమవుతున్నారు. అలాగే రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్‌కి రావడం తగ్గిపోవడం గమనించాము. టికెట్ల ధరలు వారికి అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. ‘ఎఫ్ 3’ అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్ల రేట్లని తగ్గించాం.

అలాంటి మూడు కథలపై పని చేస్తున్నాం…

సినిమా మారుతూ ఉంది. ఎన్ని సినిమాలు చేసినా ఇప్పుడంతా లార్జన్ దెన్ లైఫ్ సినిమాలు గురించే మాట్లాడుకుంటున్నారు. మార్వెల్ , అవతార్ లాంటి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలే ఇండస్ట్రీని నిలబడుతున్నాయి. తెలుగులో ఈ ట్రెండ్ మొదలైంది. రాజమౌళి… బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌తో దీనికి శ్రీకారం చుట్టారు. మేము కూడా మూడు కథలపై పని చేస్తున్నాం. రెండేళ్ళలో ఒకటి, రెండు పెద్ద సినిమాలు మా బ్యానర్ నుండి ప్రకటించే అవకాశం వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News