Sunday, December 22, 2024

‘ఎఫ్ 3’ ట్రైలర్ విడుదల.. నవ్వులే నవ్వులు

- Advertisement -
- Advertisement -

F3 Movie Trailer launched

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్ 3’.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిసున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ మూవీలో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్‌ గా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను నవ్వులు పూయిస్తోంది. ‘ఎఫ్ 3’ డబ్బు చుట్టూ తిరిగే కథ అని, పెళ్లి తర్వాత వచ్చే కష్టాలను వినోదాత్మకంగా చూపించామని తెలిపారు. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మే 29న ఈ చిత్రం భారీ ఎత్తున థీయేటరల్లో విడుదల కానుంది.

F3 Movie Trailer launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News