Sunday, December 22, 2024

మే 27న ‘ఎఫ్ ౩’

- Advertisement -
- Advertisement -

F3 Release on May 27th

 

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఫన్ ఫిల్ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్3’. ఈ వేసవికి ఈ చిత్రం మూడు రెట్ల వినోదాన్ని అందించనుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాస్త ఆలస్యంగా మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’ పాట విడుదలై విశేష ఆదరణను దక్కించుకుంది. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్‌తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా తమ అందంతో కట్టిపడేసేందుకు సిద్ధవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News