Monday, March 31, 2025

సరదా ఆటలో కూల్ కూల్‌గా…

- Advertisement -
- Advertisement -

F3 second single release on aprl 22

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ల సూపర్ క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’ థీమ్ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా ఈనెల 22న చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాటని విడుదల చేయనుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్‌లో ప్రధాన తారాగణం రోప్ పుల్లింగ్ ఆట ఆడుతూ కనిపించారు. ఒక వైపు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ తాడును లాగుతుండగా మరోవైపు వరుణ్ తేజ్ ఒంటరిగా కష్టపడటం, వెంకటేష్ తన మార్క్ స్టయిల్‌లో వరుణ్‌ని ప్రోత్సహించడం ఆకట్టుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కూల్‌గా కనిపిస్తుండగా… తమన్నా, మెహ్రీన్, సోనాల్ గ్లామర్‌గా కనిపిస్తున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ‘ఎఫ్ 3’ ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News