తెలుగు వినోద రంగంలో నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటే అందరికి గుర్తుకువచ్చేది వన్ అండ్ ఓన్లీ జీ తెలుగు. ఎప్పటికప్పుడు విభిన్నమైన కార్యక్రమాలను అందిస్తూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది జీ తెలుగు. 2005లో టెలివిజన్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి వినోద కార్యక్రమాల్లో, రియాలిటీ షోస్లలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. తెలుగు ప్రేక్షకుల్ని అనునిత్యం ఎంటర్టైన్ చేస్తున్న జీ తెలుగు 17 ఏళ్లు పూర్తి చేసుకుని మరో మైలురాయిని అధిగమించింది. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జీ తెలుగు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అంబరాన్నంటాయి. జీ తెలుగు మహోత్సవం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం జీ తెలుగులో మే 22 సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కానుంది.
జీ తెలుగు విజయానికి అసలు కారకులు ప్రేక్షకులే. వారి ఆదరాభిమానాలే జీ తెలుగును ఈ స్థాయిలో నిలబెట్టాయి. ప్రేక్షకులు కురిపించిన అభిమానానికి గుర్తుగా ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది జీ తెలుగు. తన యాంకరింగ్తో అందర్నీ అలరించే శ్రీముఖి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. శ్రీముఖి యాంకరింగ్తో పాటు అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, అంతకుమించిన మ్యూజికల్ పర్ఫార్మెన్స్లు కార్యక్రమాన్ని ఆద్యంతం హుషారుగా మార్చేశాయి. ఇక ఈ కార్యక్రమంలో ఎఫ్3 టీమ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, వరుణ్తేజ్, మెహ్రీన్, సోనాల్, సునీల్, దర్శకుడు అనీల్ రావిపూడి తమ అల్లరితో కార్యక్రమాన్ని మరింత ఉల్లాసభరింతగా మార్చేశారు. అందరికంటే ఎక్కువగా విక్టరీ వెంకటేశ్ చేసిన కామెడీ, నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ని ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూసి తీరాల్సిందే..
ఇంతకుముందెప్పుడు కనీవినీ ఎరుగుని రీతిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్లను జీ తెలుగు మహోత్సవంలో ప్రేక్షకులు చూడబోతున్నారు. సరిగమపలో పాల్గొని ప్రతీ ఒక్కరి కుటుంబ సభ్యురాలిలా మారిపోయింది సింగర్ పార్వతి. ఆమె ప్రయాణంపై సరిగమప సింగర్స్ మరియు రీల్ జోడీలు ఇచ్చిన ప్రదర్శన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. వీటితోపాటు కొన్ని ఫన్ గేమ్స్ మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాయి.
జీ తెలుగు 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జీ మహోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రేక్షకులకు వినోదాన్ని నిరంతరాయంగా అందించేందుకు జీ తెలుగు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనే విషయం ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపితమైంది. గత 17 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల కోసం అద్భుతమైన మరియు వినూత్నమైన కార్యక్రమాలను అందిస్తోన్న జీ తెలుగుని.. ప్రేక్షకులు కూడా ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూనే ఉన్నారు. 17 ఏళ్లు పూర్తి చేసుకుని మరో ఏడాదిలో అడుగుపెడుతున్న సమయంలో జీతెలుగుపై బాధ్యత మరింత పెరిగింది. ఈ బాధ్యతని అవిఘ్నంగా నిర్వహిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు సదా ప్రయత్నిస్తూనే ఉంటుంది.
ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు విభిన్నమైన మరియు వినూత్నమైన వినోదాన్ని అందించే ఉద్దేశంతో జీ తెలుగును ప్రారంభించాం. ఛానెల్ ప్రారంభించిన దగ్గర నుంచి తెలుగు ప్రేక్షకులు మెచ్చే వినోదాన్ని అందిస్తూనే ఉన్నాము. ఈ సందర్భంగా మాకు ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన మద్దతు, ప్రేమ లభించింది. ఇదే మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ రంగంలో తిరుగులేని శక్తిగా నిలబడేలా చేసింది. నిరంతరాయంగా మాకు మద్దతు ఇస్తూ మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులకు మేం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 17 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన జీ తెలుగు మహోత్సవం ద్వారా మాకు అలాంటి అవకాశం దక్కింది. ఆకట్టుకునే ఆటపాటలు, అదిరిపోయే మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో కూడిన జీ తెలుగు మహోత్సవం మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను అని ఆమె తెలిపారు. మే 22న సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగులో మహోత్సవం కార్యక్రమం ప్రసారం కానుంది.
F3 Team participate in Zee Telugu Mahotsavam