- Advertisement -
లక్నో: ఫేస్‌బుక్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లక్నోకు చెందిన ఓ విద్యార్తి (29) నీట్‌లో అర్హత సాధించలేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వెంటనే అతడు తన ఫేస్‌బుక్ పేజీలో ఆత్మహత్య చేసుకుంటానని సందేశాన్ని పంపాడు. పోలీసులు అప్రమత్తమై వెంటనే అతడి ఇంటికి చేరుకొని రక్షించారు. ఉత్తర ప్రేదేశ్ పోలీసులు ఫేస్‌బుక్ సంస్థతో సూసైడ్ లాంటి పోస్టులు పెట్టగానే రియల్ టైమ్ సాంకేతికతో గుర్తించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓ యువకుడి ప్రాణాలను ఫేస్‌బుక్ సంస్థ కాపాడడంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించుకోవాలి కానీ చెడు కోసం కాదని నెటిజన్లు సూచిస్తున్నారు.
- Advertisement -