Monday, November 18, 2024

ఒంటరిగా కారులో వెళ్తున్నా మాస్కు తప్పనిసరి

- Advertisement -
- Advertisement -
Face Mask is Must When Traveling Alone
ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దృష్టా బహిరంగ ప్రదేశాలలో ఒంటరిగా కారులో వెళుతున్న వ్యక్తి సైతం తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్క్ ధారణను సురక్షా కవచంగా హైకోర్టు అభివర్ణించింది. ప్రైవేట్ కారులో మాస్క్ లేకుండా ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి సైతం ఛలాన్ విధించాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.

ప్రైవేట్ వాహనంలో ఒంటరిగా వెళుతున్న వ్యక్తులపై మాస్క్ ధరించనందుకు ఛలాన్లు విధించడాన్ని సవాలు చేస్తూ నలుగురు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. వాహనంలో ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్న వ్యక్తి కూడా బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్నట్లేనని జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కారులో ఒంటరిగా వెళుతున్నంత మాత్రాన బహిరంగ ప్రదేశాలలో ఆ వ్యక్తికి వైరస్ సోకడానికి ఆ వ్యక్తి బహిరంగ ప్రదేశాలలో తిరిగినట్లేనని, ఆ వ్యక్తికి వైరస్ సోకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని న్యాయమూర్తి అన్నారు. ఒక వ్యక్తి ఒంటరిగా వాహనంలో ప్రయాణిస్తున్నంత మాత్రాన ఆ వ్యక్తి బహిరంగ ప్రదేశాలలోకి రావడం లేదని పరిగణించలేమని న్యాయమూర్తి అన్నారు.

కొవిడ్-19 మహమ్మారి ప్రబలుతున్న దృష్టా మాస్క్ ధరించడం తప్పనిసరని న్యాయమూర్తి చెప్పారు. ఒక వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్నాడా లేదా అన్న విషయానికి, మాస్క్ ధారణకు సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసింది. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న కాలంలో లక్షల మంది ప్రాణాలను కాపాడటంలో మాస్క్ ధారణ ఎంతగానో ఉపయోగపడిందని న్యాయమూర్తి తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఫేస్ మాస్క్ ధరించడం అత్యంత ముఖ్యమని జాఈయ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు ప్రజలకు పిలుపునచ్చిన విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకత ఇప్పటికీ ఉందని కోర్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News