Monday, December 23, 2024

ఢిల్లీలో మళ్లీ ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి…

- Advertisement -
- Advertisement -

Face masks mandatory again in Delhi

ఢిల్లీలో మళ్లీ ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి… ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా

న్యూఢిల్లీ : మళ్లీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కొవిడ్ 19 మాస్క్‌లను తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించకుండా ఉల్లంఘనకు పాల్పడితే రూ.500 జరిమానా విధిస్తున్నట్టు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు భౌతిక తరగతులను కొనసాగిస్తాయని, అయితే మెరుగైన నిర్వహణ కోసం ఎస్ వోపీలు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. సామాజిక సమావేశాలపై నిషేధం ఉండదు కానీ అన్ని రకాలపై నిశిత పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో 4.42 శాతం పాజిటివ్ రేటుతో 632 తాజా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం రోజువారీ సంఖ్య 501 కాగా, పాజిటివిటీ రేటు 7.72 శాతంగా ఉంది. ఏప్రిల్ 11 నుంచి 18 మధ్య ఢిల్లీలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య దాదాపు ముడు రెట్లు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News