Monday, November 25, 2024

తాలిబన్ల అనుకూల సమాచారంపై ఫేస్‌బుక్ నిషేధం

- Advertisement -
- Advertisement -

Facebook ban of Taliban-related content

 

లండన్: తాలిబన్లకు అనుకూలమైన సమాచారంపై తమ సంస్థకు చెందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో నిషేధం విధిస్తున్నట్టు ఫేస్‌బుక్ తెలిపింది. అమెరికా చట్టాల ప్రకారం తాలిబన్‌ను ఉగ్రవాద సంస్థగా ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తమ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల్లోనూ తాలిబన్లకు చెందిన ఖాతాలుంటే వాటిని తొలగిస్తామని తెలిపారు. అఫ్గన్ ప్రజల స్థానిక భాషలైన దరి, పస్థోలను అర్థం చేసుకోగల నిపుణులు తమ సంస్థకు ఉన్నారని, వారి సహాయంతో తాలిబన్ల అనుకూల సమాచారాన్ని తొలగిస్తామని పేర్కొన్నారు. జాతీయ ప్రభుత్వాలను గుర్తించే పని తమ సంస్థ చేయదని, అంతర్జాతీయ అధికారిక సంస్థల నిర్ణయాలను తాము అనుసరిస్తామని ఫేస్‌బుక్ తెలిపింది. సోషల్ మీడియాను తాలిబన్లు చురుగ్గా వినియోగించుకుంటున్నట్టుగా పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News