- Advertisement -
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పేస్‌బుక్ ఖాతాపై రెండేళ్ల పాటు నిషేధం విధించినట్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వెల్లడించింది. ఆ తరువాత నిషేధంపై సమీక్షిస్తామని చెప్పింది. ఈ ఏడాది జనవరి 6న అధ్యక్ష ఎన్నికల సందర్భంగా క్యాపిటల్ హిల్స్‌లో అల్లర్లు జరిగాయి. ట్రంప్ ఫేస్‌బుక్ తోపాటు ఇతర సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అల్లర్లకు దారి తీశాయని ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ చేసిన పోస్టులు సంస్థ నియమాలను ఉల్లంఘించాయని, కంపెనీ ప్రపంచ వ్యవహారాల ఉపాధ్యక్షుడు నిక్‌క్లెగ్ పేర్కొన్నారు. దీంతో రెండేళ్లపాటు ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతాను నిషేధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 7 నుంచి ఈ నిషేధం అమలు లోకి వచ్చిందని చెప్పారు.
- Advertisement -