Monday, December 23, 2024

భూమన వర్గీయుల అరాచకం… ఫేస్‌బుక్ కామెంట్… కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి ఎంఎల్‌ఎ భూమన కరుణాకర్ రెడ్డి వర్గీయులు అరాచకం సృష్టించారు. కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఫేస్‌బుక్‌లో వైసిపి కార్యకర్త పోస్టు పెట్టాడు. ఆ పోస్టుపట్ల రాజంపేట మండలం మన్నూరుకు చెందిన పత్తిమణి స్పందించాడు. వారసత్వ రాజకీయం చేయడానికి ఇది రాజరిక పాలన కాదని కామెంట్ చేశాడు. తిరుపతికి చెందిన 14 మంది వైసిపి కార్యకర్తలు పత్తి మణిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం పలు ప్రదేశాల్లో వాహనాల్లో వైసిపి కార్యకర్తలు తిప్పారు. చితకబాది రాజంపేట నుంచి రాపూర్ వైపు రెండు కార్లలో తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించారు. చిట్వేల్ దగ్గర నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బాధితుడికి చిట్వేలు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులను రాజంపేట రూరల్ ఎస్‌ఐ భక్తవస్థలంకు పోలీసులు అప్పగించారు.

Also Read: పనివంతులకే పట్టం కట్టాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News