లక్ష రూపాయలు పంపించిన బాధితుడు
హైదరాబాద్: ఫేస్బుక్లో పరిచయమైన యువతి విసిరిన వలపు వలకు చిక్కిన యువకుడు అక్షరాల లక్ష రూపాయలు సమర్పించుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని మలక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్బుక్లో యువతి పరిచయమైంది. కొద్ది రోజులు ఇద్దరు ఛాటింగ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ నంబర్ ఇచ్చుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం వీడియో కాల్ చేసుకునే వరకు వెళ్లింది. ఓ రోజు యువతి నగ్నంగా వీడియో కాల్ చేసింది. యువకుడిని కూడా నగ్నంగా మారమని చెప్పింది. యువతి చెప్పినట్లు చేయడంతో వీడియో కాల్‌ను రికార్డు చేసింది. కొద్ది రోజులు తర్వాత నీ నగ్న వీడియో కాల్ రికార్డు చేశానని, తనకు డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడుతునానని బెదిరించింది. దీనికి భయపడిన బాధితుడు యువతికి లక్ష రూపాయలు పంపించాడు. అయిన మళ్లీ డబ్బులు పంపించాలని వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మలక్ పేట పోలీసులు తెలిపారు.