Wednesday, January 22, 2025

భారతీయ టెక్కీలకు మెటా షాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మెటా తొలగించిన ఉద్యోగుల్లో ఇటీవల చేరిన భారతీయ టెక్కీలు కూడా గణనీయంగా ఉన్నారు. వీరిలో చాలామంది కేవలం రెండు మూడు రోజుల కిందటే వారి స్థిరమైన ఉద్యోగాలను వదిలి మెటాలో చేరి నిరుద్యోగులుగా మారారు. ఖర్చులను తగ్గించే క్రమంలో ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా 11వేల మంది ఉద్యోగులను తొలగించింది. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో చేరినరెండు రోజుల్లోనే ఉద్యోగాన్ని కోల్పోయినట్లు ఐటి ప్రొఫెషనల్ నీలిమ అగర్వాల్ తెలిపారు. కంపెనీ భారీఎత్తును తొలగించిన ఉద్యోగుల్లో తను కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ వీసా ప్రాసెస్‌ను క్రితమే నుంచి కెనడా చేరుకుని రెండురోజుల క్రితమే మెటాలో చేరాను. కానీ దురదృష్టవశాత్తు తనను కూడా ఉద్యోగం నుంచి తొలగించారని నీలిమ తెలిపారు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో గత రెండేళ్లుగా పనిచేస్తున్న నీలిమ ఆ ఉద్యోగాన్ని వదిలి మెటాలో చేరి ఉద్యోగాన్ని కోల్పోయారు.

అదేవిధంగా బెంగళూరులో మూడేళ్లుగా పనిచేసిన విశ్వజిత్ ఝా కూడా మూడురోజుల క్రితమే మెటాలో చేరి ఉద్యోగాన్ని కోల్పోయారు. వీసాకోసం చాలాకాలం వేచిఉండిమెటాలో చేరిన తనకు ఉద్యోగం పోయింది. తనలా ఉద్యోగం కోల్పోయినవారిని తలచుకుని బాధ కలుగుతుందని విశ్వజిత్ పేర్కొన్నారు. సంస్థ మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా తొలగించిన పదకొండువేలమంది ఉద్యోగులు సుమారు ఉండగా వీరిలో భారతీయ ఉద్యోగులు కూడా భద్రతకు దూరంగా ఉన్నారు. ఏ దేశం కూడాప్రత్యేకంగా ఎంతమంది తమ దేశస్థులు మెటాలో ఉద్యోగం కోల్పోయారనేది ప్రకటించలేదు.

మెటాలో పనిచేస్తున్న భారతీయ సిబ్బంది కూడా భవిష్యత్తు కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. మెటా సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ తమ ఉద్యోగులకు కొలువుల కోతను తెలుపుతూ బహిరంగలేఖ రాసిన వెంటనే అధికారులు చర్యలకు పూనుకున్నారు. అమెరికాలో గత మెటా సాంకేతిక బృందంతో కలిసి పనిచేస్తున్న రాజు మెటాలో ఉద్యోగుల కోతను ఇంతకుముందెన్నడూ చూడలేదని ఇదే ప్రథమంగా పేర్కొన్నారు. అమెరికా పౌరులుగా ఉన్న కుమారులపై ప్రభావం పడనుందని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభావిత ఉద్యోగులకు జుకర్‌బర్గ్ 16వారాల మూలవేతనంతోపాటు గతంలో పనిచేసిన ప్రతి సంవత్సరం సర్వీస్‌కు రెండు అదనపువారాల సెవరెన్స్ ప్యాకేజీను అందిస్తామని హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News