Sunday, December 22, 2024

ఫేస్‌బుక్ ప్రేమ.. మోసపోయిన యువతి

- Advertisement -
- Advertisement -

ఫేస్‌బుస్‌లో పరిచయమైన యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి పలుమార్లు శారీరకంగా కలిసి మోసం చేసిన యువకుడిని రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. జనగాం జిల్లా, గంగారం గ్రామానికి చెందిన బందారం స్వామి(29) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం, రాయపూర్ జిల్లాకు చెందిన యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపిన స్వామి వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో యువతి హైదరాబాద్‌కు వచ్చింది,

ఈ సమయంలోనే ఇద్దరు శారీరకంగా పలుమార్లు కలిశారు. తర్వాత తాను ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు చెప్పాడు. తనను వివాహం చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయగా నిందితుడు ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న యువతి తనపై అత్యాచారం చేశాడని స్వామిపై రాయపూర్ విధానసభ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హైదరాబాద్‌కు బదిలీ చేశారు. నిందితుడు శ్రీలంక దేశం మీదుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు రాగా పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News