హైదరాబాద్: అందరికి విద్య అందించాలనే లక్షంతో ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. బుధవారం సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ పాఠశాలను హోంమంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్యే రాజాసింగ్‌లతో కలిసి పరిశీలించారు. పూర్తిగా శిథిలావస్దలో ఉన్న ఈపాఠశాల స్దానంలో విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులతో కూడిన నూతన భవనాన్ని సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు టాటా సంస్ద ముందుకొచ్చింది. ఈసంస్ద ప్రతినిధి కృష్ణారెడ్డి భవన నిర్మాణానికి సంబంధించి మంత్రికి వివరించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ప్లేగ్రౌండ్‌ను కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
పేద విద్యార్ధులు అత్యధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి స్వచ్చంధ సంస్దలు, దాతలు ముందుకు రావడం ఎంతో సంతోషదాయకమని టాటా సంస్ద ప్రతినిధులను అభినందించారు. 20 రోజులుగా శిథిలావస్దలో ఉన్న భవనాన్ని పూర్తిగా తొలగించి వ్యర్దాలను బయటకు తరలించి ఈప్రాంతాన్ని శుభ్రం చేసి టాటా సంస్దకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచనల మేరకు మన బస్తీమన బడి కార్యక్రమం చేపట్టం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిస్దాయిలో మారనున్నాయని వివరించారు. అంతేగాకుండా ఈవిద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం బోధన ప్రారంభించినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో డిఈఓ రోహిణి, జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ డిఈఓ