గోదావరిఖని : గోదావరిఖని సప్తగిరి కాలనీలోని బిసి కళాశాల, బాలికల వసతి గృహం పేరుకే ఉందని, వసతులు శూన్యంగా ఉన్నాయని బిజెపి మహిళా మోర్చ కార్యవర్గ సభ్యురాలు సొమారపు లావణ్య అరుణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె కళాశాల, వసతి గృహాన్ని సందర్శించి వసతులపై పర్యవేక్షించారు. అనంతరం లావణ్య మాట్లాడుతూ.. విద్యార్థీనులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, దీంతో పాటు ఆకతాయిల అల్లరితనంతో విద్యార్థులు విసిగిపోతున్నారు.
ఆహారం విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని , సరైన ఆహారం అందించకపోవడంతో విద్యార్థీనులు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. వెంటనే నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, విద్యార్థీనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాతంగి రేణుక, భారతి, మల్కాపూర్ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, 5వ ఇంక్లయిన్ మండల అధ్యక్షుడు డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.