Monday, December 23, 2024

వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటపడ్డాయి…

- Advertisement -
- Advertisement -

నారాయణ సంచలన వ్యాఖ్యలు

Vivekananda Reddy

 

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఎపిలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఇదే అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నారాయణ మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు బయటికి వచ్చాయని.. నిందితులు ఎవరో బయటపడ్డారని వ్యాఖ్యానించారు. వివేకా హత్యకు వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత వహించాలని నారాయణ అన్నారు. కానీ ప్రస్తుతం సిబిఐపై కూడా ఎదురు దాడి జరుగుతుందని.. అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడికిపోతోందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని రాజకీయ హత్యలు జరిగే అవ కాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News