Monday, December 23, 2024

శ్రీరాముడిని అవమానించినందుకు విధుల నుంచి ఫ్యాకల్టీ మెంబర్ తొలగింపు

- Advertisement -
- Advertisement -

Faculty member fired for insulting Lord Rama

జలంధర్ : హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ ( ఎల్‌పీయూ) ఫ్యాకల్టీ సభ్యురాలు గురుసంగ్ ప్రీత్ కౌర్ అవమానించడంపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో ఆమెను విధుల నుంచి యూనివర్శిటీ తొలగించింది. ప్రీత్ కౌర్ ఎల్‌పీయూ విద్యార్థులకు విద్యాబోధనలో భాగంగా మాట్లాడుతూ “ నిజానికి రాముడు ఎంతమాత్రం మంచి వ్యక్తి కాదని, రావణాసురుడు మంచివాడని వ్యాఖ్యానించారు. రాముడు జిత్తుల మారి అయని, సీతను చిక్కుల్లో పెట్టడానికి ఆయన ఈ ప్రణాళిక రచించాడని, రావణుడి మీదకు నిందను తోసేశాడని వ్యాఖ్యానించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎల్‌పీయూ స్పందిస్తూ ఈ అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతమైనవని, దీనికి యూనివర్శిటీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఆమెను తక్షణమే విధుల నుంచి తొలగించినట్టు తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News