Wednesday, January 22, 2025

ఫడ్నవిస్ సూపర్ సిఎం..అజిత్ పవార్ ‘దాదాగిరి’ : నానా పటోల్

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ సూపర్ సిఎం అయితే , మరో డిప్యూటీ సిఎం అజిత్ పవార్ ‘దాదాగిరి’ మనకు తెలిసిందేనని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ గురువారం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఫైల్స్ వెళ్లే ముందు అజిత్ పవార్, ఫడ్నవిస్ పరిశీలనకు వెళ్తుంటాయని ఆరోపించారు. అన్ని విబాగాల ఫైల్స్ అజిత్ పవార్ పరిశీలనకు ఆతరువాత ఫడ్నవిస్‌కు వెళ్తుంటాయని, వీరిద్దరి పరిశీలన తరువాత చీఫ్ సెక్రటరీ మనోజ్ సౌనిక్ ముఖ్యమంత్రి షిండేకి క్లియరెన్సుకు పంపిస్తుంటారని వ్యాఖ్యానించారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వం లోని శివసేన ఎమ్‌ఎల్‌ఎలు మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోడానికి అజిత్ పవార్‌ను నిందిస్తుంటారని, కానీ అజిత్ పవారే ప్రభుత్వంలో చేరారని పటోల్ ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News